సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకండి..!

post

కరోనా పై సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మోద్దని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. . శనివారం లాహోర్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా ‘కరోనా రిలీఫ్‌ ఫండ్‌’ను ప్రారంభించిన అనంతరం ఇమ్రాన్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణ పాటించనివారిని ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.  
          గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం నా దృష్టికి వచ్చింది. అల్లా పాక్‌ ప్రజలకు కరోనా మహమ్మారి రాకుండా చేశారనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మహమ్మారి కరోనా ఎవరినీ విడిచి పెట్టదు. పాక్‌ ప్రజలకు రోగనిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటారని దీంతో కరోనా రాదని, వచ్చిన ఏం కాదనే భావన కూడా సరైనది కాదు. న్యూయార్క్‌ నగరాన్ని చూడండి.. ఎంతో మంది ధనికులున్న ఆ సిటీ పరిస్థితిని గమనించండి.. ఈ సమయంలో మూర్ఖులుగా ప్రవర్తించి చరిత్రలో నిలిచిపోకండి’అని పాక్‌ ప్రజలకు ఇమ్రాన్‌ ఖాన్‌ విజ్ఞప్తి చేశారు.