ఒక్క పోస్ట్ మ్యాన్.. వేల మందికి క్వారంటైన్..!

post

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బీజేబీ నగర్ సబ్‌పోస్టాఫీస్‌‌‌కు చెందిన ఓ పోస్ట్‌మ్యాన్ గత నెల 10న ఢిల్లీ నుంచి వచ్చినట్టు భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీసీ చౌధురీ తెలిపారు. అనంతరం అతడు గౌతంనగర్, ఖుర్దా జిల్లా, సెషన్స్ కోర్టు పరిధిలోని లాయర్లు, పోలీసులు సహా వేలాదిమందికి లాక్‌డౌన్‌ లోఉత్తరాలు బట్వాడా చేశాడు. అతడి నుంచి ఉత్తరాలు అందుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని, స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్ కోరారు. ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే 104 సర్వీసుకు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.