మెట్రో పాస్ లు వచ్చేస్తున్నాయ్..!

post

 త్వరిత గమనానికి మెట్రో పెట్టింది పేరు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం మరియు వేగవంతం చేసే లక్ష్యాలతో మెట్రో నిర్మాణం జరిగింది. ఇప్పటికే దేశం లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ, సమయాన్ని సద్వినియోగం చేస్తూ మెట్రో తన సేవలను విస్తరించుకుంటూ పోతోంది. మరిన్ని నగరాలను మెట్రో నగరాలుగా మార్చడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇప్పటికే అరవై వేల మంది..!

          సేఫ్ గా సౌకర్యవంతం గా ఉండటమే కాకుండా, మరింత సమయాన్ని ఆదా చేస్తుండటం తో హైదరాబాద్ ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు మెట్రో పైనే ఆధార పడుతున్నారు. కాగా, రద్దీ మరింత పెరిగింది. దీనివల్ల క్యూ లైన్లలో మరింత వేచి ఉండాల్సిన అవసరం వస్తోంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి మెట్రో అధికారులు ఇప్పటికే క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ కార్డు ను అందుబాటులోకి తెచ్చారు. నగరం లో ఈ కార్డు ద్వారా ప్రయాణించే వారి సంఖ్య ఇప్పటికే అరవై వేలకు చేరినట్లు ఓ అంచనా. పే టి ఎం భాగస్వామ్యం తో అందుబాటులోకి తెచ్చిన ఈ విధానం ద్వారా క్యూ లో నుంచోవలసిన అవసరం రాదని, ప్రయాణికులు ఈ విధానం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి చెప్పుకొచ్చారు.  మరో రెండు మూడు రోజుల్లో మెట్రో పాస్ లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పారు.

కరోనా వైరస్ పై భయం వద్దు..!

       అన్ని రకాలుగా మెట్రో సురక్షితమైన ప్రయాణమని, భద్రత, శుభ్రత విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులు ప్రయాణించే, టచ్ చేసే ప్రతి చోటును కెమికల్ శానిటైజర్లతో తో శుభ్రం చేస్తున్నామని, కరోనా వైరస్ వ్యాప్తి పై మెట్రో ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.