మూడు దశలుగా లాక్ డౌన్..?

post

దేశవ్యాప్తం గా ప్రస్తుతం లాక్ డౌన్  అమలు లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14 తో ఇది ముగియనుంది. తరువాత ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే లాక్ డౌన్ ను పొడిగిస్తున్నారంటూ పలు వార్తా కధనాలు వచ్చాయి. వీటిపై ఇప్పటికే కేంద్రం వివరణ ఇచ్చింది. లాక్ డౌన్ ను పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన రాజేశ్ సింగ్, ఆర్. అధికారి అనే విద్యావేత్తలు చేసిన అధ్యయనంలో కొన్ని విషయాలను  తెలిపారు. భారత దేశం లో ఒక లాక్ డౌన్ సరిపోదని దశల వారీ గా మూడు సార్లు లాక్ డౌన్ ను విధించాలని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ముగిశాక మరో ఐదు రోజుల విరామం తో 28 రోజుల లాక్ డౌన్ ను విధించాలని ఆయన సూచించారు. మొదటి దశ లాక్ డౌన్ వ్యాప్తి ని నివారిస్తుందని, అయితే కరోనా మరల విజృంభించే అవకాశం ఉన్నందున తిరిగి లాక్ డౌన్ పాటిస్తే మరింత ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. రెండవ దశ కూడా పూర్తి అయ్యాక మరో ఐదు రోజుల విరామం తో 18 రోజుల లాక్ డౌన్ ప్రకటించాలని సూచించారు. మూడవ దశ పూర్తయ్యాక పాజిటివ్ కేసుల సంఖ్యా గణనీయంగా తగ్గుతుంది అని, వ్యాప్తి కూడా అదుపులోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.