పోలీసులపై పూల వర్షం..!

post

కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తోంది  పోలీసులు,వైద్యులు, పారిశుధ్య కార్మికులే. వీరు చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే నాలుగురోజుల కిందట పంజాబ్ లో పారిశుధ్య కార్మికులపై ఒక కాలనీ వాసులు పూల వర్షం కురిపించారు. అదే తరహాలో తాజాగా ఉత్తరప్రదేశ్ లో పోలీసులపై కూడ పూలు జల్లారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని భుదావ్ ప్రాంతంలో లాక్‌డౌన్‌లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండ చూసుకొనేందుకు పోలీసులు  నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.
        ఇందులో భాగంగా  శనివారం కూడా లాక్‌డౌన్ సరిగ్గా అమలు అవుతుందా.. లేదా.. అని పరిశీలించేందుకు రోజూలాగానే పోలీసులు పెట్రోలింగ్‌కి వెళ్లారు. ఎప్పడైతే వాళ్లు ఆ ప్రాంతంలోని ప్రవేశించి నడవటం ప్రారంభించారో.. అప్పటి నుంచి వారిపై పై నుంచి గులాబీ పూల వాన కురవడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని భుదావ్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ముస్లింలు వారిపై పూల వాన కురిపించారు’’ అని వాళ్లు పేర్కొన్నారు.