వైద్యుల భద్రతకు వాట్సప్ గ్రూప్ లు..!

post

కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, హెల్త్ కేర్ నిపుణుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రులు, క్వారన్ టైన్ కేంద్రాలలో విధులు నిర్వహించే వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి తగు భద్రత కల్పించడానికి గాను తమ పరిధిలోని పోలీస్ అధికారులు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తో కూడిన ప్రత్యేక వాట్సప్ గ్రూప్ లను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ చెప్పారు. విధుల్లో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు చేపట్టడంతోపాటు స్థానికంగా డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది రక్షణ కల్పించడానికి వారితో నిరంతరం టచ్‌లో ఉండాలని  పోలీస్ కమిషనర్‌లు, ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు..  వైద్య సిబ్బందికి అండగా ఉండేందుకు గాను రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని పోలీస్ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్‌ల ను ఆదేశించారు.