సాగరంలో చిక్కుకున్న 40 వేల మంది నావికులు..!

post

దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి వారక్కడే తమ ఇళ్లకే పరిమితమై పోయారు.పనుల మీద విదేశాలకు వెళ్లిన వారు విమానాలు తిరిగిన కాలంలో ఇంటిముఖం పట్టారు. కాని సముద్రంలో ప్రయాణించే నావికులు మాత్రం చిక్కుకు పోయారు.కరోనా నేపధ్యంలోప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది భారతీయ నావికులు, సిబ్బంది చిక్కుకుపోయారు. వీరిలో  500 సరుకు రవాణా ఓడల్లో దాదాపు 15 వేల మంది నావికులు చిక్కుకుపోగా, 25,000 మంది యుద్ధ నౌకల్లో ఉన్నారు.  షిప్పింగ్ మినిస్ట్రీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని, ఓడల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు మారిటైం సంఘాలు ఎన్‌యూఎస్ఐ, ఎంయూఐ ఎంఏఎస్ఎస్ఏ వంటివి తెలిపాయి.