సాయం చేస్తామని చెప్పి.. లో దుస్తులతో మాస్కులు పంపిన చైనా..!

post

డ్రాగన్ కంట్రీ చైనా ను పాకిస్థాన్ ఎపుడు వెనకేసుకొస్తుంటుంది. చైనా కూడా పాకిస్తాన్ కు అపుడపుడు సాయం చేస్తున్నట్లుంటుంది. అయితే. కరోనా మహమ్మారి పై పోరు కు కూడా పాకిస్థాన్ కు చైనా సాయం చేస్తామని ప్రకటించింది. దాదాపు 2 లక్షల సాధారణ మాస్కులు, 2 వేల ఎన్‌-95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2 వేల కరోనా టెస్టింగ్ కిట్లు,  2 వేల మెడికల్ సూట్లు పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. అయితే, సింధ్‌ ప్రావిన్స్‌ చేరుకున్న ఈ మెడికల్ సామగ్రి ని  ఆసుపత్రులకు సరఫరా చేశారు. అయితే, లోదుస్తులతో చేసిన మాస్కులను చూసి వైద్యులు ఖంగు తిన్నారు. దీనితో, ఈ విషయాన్నీ పాక్ మీడియా బయట పెట్టి చైనాను విమర్శిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను పాక్‌ మీడియా ప్రసారం చేసింది.