టైమ్ మహిళల జాబితాలో ఇందిర..!

post

భారత్ నుంచి ఇద్దరు మహిళలకు టైమ్ మేగజైన్ ప్రకటించిన శక్తిమంతమైన మహిళల జాబితాలో  చోటు దక్కింది.గత శతాబ్దికాలంలో  మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, స్వాతంత్య్రోద్యమకారిణి అమృత్‌ కౌర్‌లు ఈ జాబితాలో వున్నారు. 
      ఉక్కుమహిళగా పేరుపొందిన ఇందిర దేశంలో మిగిలిన నాయకులకు భిన్నంగా  అపరిమితమైన అధికారం చెలాయించారని తన కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల ప్రజల్లో తన దైన స్దానాన్ని పొందారని టైమ్ పేర్కొంది. దేశంలో అత్యవసర పరిస్దితి ప్రకటించి తనలోని కాఠిన్యాన్ని కూడ బయట పెట్టారంది.  పంజాబ్ కు చెందిన అమృత్‌ కౌర్ మహాత్మాగాందీ బాటలో నడిచారని టైమ్ పేర్కొంది.  ఇందిరా గాంధీని 1976 సంవత్సరానికి, అమృత్‌ కౌర్‌ను 1947 సంవత్సరానికి ‘విమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా టైమ్‌ ప్రకటించింది.