నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ..!

post

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడడంతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.మార్చి 19 నామినేషన్ దాఖలుకు చివరి రోజుగా నిర్ణయించారు. మార్చి 20వ తేదీన నామినేషన్ల పరిశీలిస్తారు. మార్చి 23వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకి గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 7న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 9న ఓట్ల లెక్కింపు చేసి ఫలితం ప్రకటించనున్నారు. ఏప్రిల్ 13 వ తేదీ వరకు ఎన్నిక ప్రక్రియని  పూర్తి చేయనున్నారు. సంఖ్యాబలం దృష్ట్యా ఈ స్థానం మళ్ళీ టీఆర్ఎస్‌కే దక్కనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ లాంఛనమే కానుంది.