కాశ్మిర్ లో 'ఆన్ లైన్ నిషేధం' ఎత్తివేత..!

post

ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత కాశ్మిర్ లో పరిస్థితులు కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించాయి. పాక్ ఆర్మీ దాడి నుంచి కాశ్మిర్ ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతను కల్పించింది. కాశ్మిర్ నుంచి దేశం లోని ఇతర ప్రాంతాలకు రైల్వే మార్గాన్ని కూడా పునరుద్ధరించింది. కాశ్మిర్ లో పరిస్థితులు చక్కదిద్దడానికి కంకణం కట్టుకుంది. పటిష్టమైన ప్రణాళిక, కార్య దక్షతతో కాశ్మిర్ ను తిరిగి మాములు చేసింది.

       కానీ, ఇప్పటివరకు కాశ్మిర్ లో ఆన్ లైన్ సేవలు ఉపయోగించుకునే వీలు లేవు. అక్కడి పరిస్థితులను దృష్టి లో ఉంచుకుని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆన్ లైన్ వాడకం పై నిషేధం విధించింది. దీనితో, అక్కడి ప్రజలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లకు దూరం గా ఉన్నారు. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం తాత్కాలికం గా ఈ ఆంక్షలను ఎత్తివేసింది.

        మార్చి 17 వ తేదీ వరకు అన్ని వెబ్సైట్లనూ 2 జి స్పీడ్ తో ఫిక్సడ్ ఇంటర్నెట్ లైన్ ద్వారా వాడుకునే అవకాశం కల్పించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. గతం లో ఓసారి జనవరి 25 న పాక్షికం గా ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ జరిగిన తరువాత కొన్ని వెబ్ సైట్ లను వాడుకునే వీలు ఉండేది. ప్రస్తుతం పోస్ట్ పెయిడ్ తరహాలో, గుర్తింపు ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత ప్రీ పెయిడ్ సిమ్ లు అందుబాటులోకి వస్తాయని అక్కడి  హోంశాఖ ముఖ్య కార్యదర్శి షలీన్‌ చెప్పారు. ప్రస్తుతం,  హైస్పీడ్‌ 4జీ నెట్‌వర్క్‌ లపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.