కలకలం రేపుతున్న ఎమ్మెల్యే రోజా ఆడియో..!

post

నగరి ఎమ్మెల్యే రోజా ఆడియో మేసేజ్ ఇప్పుడు కలకలం రేపుతుంది. తన సొంత నియోజకవర్గంలో… అసమ్మతి వర్గానికి చెందిన కేజీ కుమార్ జన్మదిన, షష్టిపూర్తి వేడుకలకు ఎవరూ హాజరుకావొద్దని ఆడియో మేసేజ్ సారాంశం. ఎవరైన తనను కాదని వెళితే… పార్టీకి దూరమవుతారని పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. ఈ వేడుకలు…. మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఆదిమూలంలలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నట్లు సమాచారం.