కోవిడ్ ట్రాకింగ్ కోసం 'ఆరోగ్య సేతు' ..!

post

కరోనా మహమ్మారి ని దేశం లో విజృంభిస్తున్న తరుణం లో ఇప్పటికే పలు రాష్ట్రప్రభుత్వాలు ఆప్ లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర ప్రభుత్వం 'ఆరోగ్య సేతు'  ఆప్ ను ప్రారంభించింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ డివైస్ లలో ఈ యాప్ పని చేస్తుంది. మీరు ఎవరైనా కరోనా సోకినా వ్యక్తి తో తిరిగి ఉంటె, మీకు కూడా కరోనా సోకిందో లేదో కూడా ఈ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆప్ ఇంగ్లీష్ తో పాటు ఇతర 11 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ ఆప్ లో మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తి అయినా తరువాత మీరు సేఫ్ జోన్ లో ఉన్నారో లేదో కూడా ఈ ఆప్ చూపిస్తుంది.