భారతి సిమెంట్స్ ఐదు కోట్ల విరాళం..!

post

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేసులు చాపకింద నీరు లా పెరుగుతున్నాయి. ఈ క్రమం లో పలువురు ప్రముఖులు తమకు తోచినంత విరాళం గా ప్రకటిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే పలు కార్పొరేట్‌ సంస్థలు ఏపీకి భారీగా విరాళాలు ప్రకటించాయి. తాజాగా,  భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌)  తన వంతు సాయం గా సీఎం సహాయనిధికి ఐదు కోట్ల సాయాన్ని ప్రకటించింది. అలానే, భారతి  సిమెంట్స్ ఉద్యోగులు కూడా 14.5 లక్షల సాయాన్ని అందించారు. మరోవైపు  వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.1.10 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం గా ఇస్తున్నట్లు ప్రకటించింది.