హైదరాబాద్ మెట్రోకు కరోనా ఎఫెక్ట్..!

post

హైదరాబాద్ మెట్రోకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. రోజు ప్రయాణించే ప్రయాణికుల్లో దాదాపుగా 20 వేల మంది తగ్గారని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే కరోనాపై ఎలాంటి భయం లేదని అధికారులు ప్రకటించినా కూడా ప్రయాణికులు మాత్రం మెట్రోలో ప్రయాణించేందుకు ఆలోచిస్తున్నారు. అయితే మెట్రో అధికారులు మాత్రం మెట్రో రైళ్లను, మెట్రో స్టేషన్లను శుభ్రం చేయిస్తోంది. క్లీనింగ్ సిబ్బంది.. మెట్రో రైళ్లలోని అంగుళం అంగుళాన్ని స్పిరిట్, కెమికల్స్‌ చల్లుతూ శుభ్రం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లను కూడా మరింత పరిశుభ్రంగా మార్చేశారు.