కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ఏడుగురు ఎంపీలు సస్పెండ్.!

post

కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఏడుగురి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. గత నాలుగు రోజులుగా ఢిల్లీ అల్లర్లపై చర్చించాలని విపక్ష ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటువేశారు. నియమ నిబంధనలు పాటించనందుకు తరుణ్ గగొయి, టీఎన్ ప్రతాపన్, డీన్ క్యురికోసే, ఆర్ ఉన్నితన్, మానిక్యం ఠాగూర్, బెన్ని బెహానన్, గుర్జిత్ సింగ్ లపై సస్పెన్షన్ వేటుపడినట్లు లోక్ సభ స్పీకర్ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.