ఐబి ఆఫీసర్ హత్య కేసులో లొంగిపోయిన తాహిర్ హుస్సేన్..!

post

ఢిల్లీ లో జరిగిన సిఏఏ వ్యతిరేక అల్లర్లలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను దారుణం గా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24 , 25 తేదీల్లో చాంద్ బాగ్ వద్దనున్న హుస్సేన్ నివాసం నుంచి ఈ ఘర్షణలు మొదలయ్యాయని పోలీసులు తేల్చారు. అంకిత్ శర్మ హత్య కేసులో తాహిర్ హుస్సేన్ ప్రధాన నిందితుడని పోలీసులు నిర్ధారించారు.

ఎవరీ తాహిర్ హుస్సేన్...?

ఢిల్లీ అల్లర్ల కు ముందు తాహిర్ హుస్సేన్ ఆప్ పార్టీ లో నాయకుడిగా కొనసాగాడు. కానీ, ఇతనికి సిఏఏ వ్యతిరేకవాదులతో సంబంధం ఉందని, ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడని తేలడం తో ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇతనిని పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాకుండా, పోలీసులు హుస్సేన్ ఇంటినుంచి, ఫ్యాక్టరీ నుంచి, యాసిడ్ సీసాలను, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ పెట్రోల్ బాంబులను హుస్సేన్ ఇంటినుంచి చుట్టూ పక్కల ఇళ్లపై విసిరేసినట్లు పోలీసుల విచారణ లో తేలింది.

    అంకిత్ శర్మను దారుణం గా హత్య చేయించారు. హత్య చేసి, శవాన్ని హుస్సేన్ ఇంటి సమీపం లోని మురికి కాలువ వద్ద పడేసిన సంగతి తెలిసిందే. ఐతే, అంకిత్ శర్మ శరీరం పై దాదాపు నాలుగువందల కత్తిపోట్లు ఉన్నాయని ఫోర్సెనిక్ నివేదిక లో తెలిపారు. ఈ హత్య కు, హుస్సేన్ కు సంబంధం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని వెదికే పనిలో పడ్డారు. అంకిత్ శర్మ హత్య తరువాత, తాహిర్ హుస్సేన్ అజ్ఞాతం లోకి వెళ్లారు.

బెయిల్ ఇప్పించండి..!

ఇది ఇలా ఉంటే, ప్రస్తుతం తాహిర్ హుస్సేన్ స్వచ్చందం గా రౌస్‌ అవెన్యూ కోర్టులో లొంగిపోయాడు. అంకిత్ శర్మ హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మంగళవారం ఢిల్లీ కోర్టు లో దాఖలు చేసుకున్నారు. కాగా, హుస్సేన్ పై అంకిత్ శర్మ తండ్రి కేసు నమోదు చేసారు. పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకున్నారు.