చంద్రబాబు పది లక్షల విరాళం..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్నతరుణం లో పలువురు ప్రముఖులు సీఎం సహాయ నిధికి ఎంతోకొంత విరాళం గా ఇస్తున్నారు. ఈ నేపధ్యం లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన వంతు సాయం గా తన కుటుంబం నుంచి పది లక్షలను విరాళం గా ఇచ్చారు. తాజాగా, ఆయన టీడీఎల్పీ సభ్యులతో ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం లో ఆయన ఈ నిర్ణయాన్ని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధకానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ విపత్కర పరిస్థితిల్లో అందరు తమ వంతు సాయం గా ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ఆయన విజ్ఞప్తి కి టీడీపీ నేతలు సహకరించారు.  టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, రోడ్లపైకి ఎవరూ రావొద్దని సూచించారు. ఆదివారం ఎలా జనతా కర్ఫ్యూ ను పాటించారో అలానే, లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు బయటకు రావొద్దని ఆయన సూచించారు.