పిట్టల్లా రాలిపోతున్న ఇటలీ ప్రజలు..!

post

కరోనా దెబ్బ ఇటలీ పై గట్టిగానే పడింది. పరిస్థితి అదుపు చేయలేక ప్రెసిడెంట్ కూడా చేతులెత్తేశారు. ఇటీవల ఆయన కన్నీళ్లతో ట్విట్టర్ లో వచ్చిన వీడియో ను చూసి యావత్ ప్రపంచ హృదయం ద్రవించింది. అక్కడ కరోనా కరాళ నృత్యానికి మరణ మృదంగం తోడయింది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే అక్కడ 743 మంది మృతి చెందారు. ప్రస్తుతం మొత్తం చనిపోయిన వారి సంఖ్యా 6,820కి చేరుకుంది. ప్రస్తుత కేసుల సంఖ్యా 69,176కి చేరింది. ఒక్కరోజులో 5,429  కేసులు నమోదు కావడం తో అక్కడి ప్రభుత్వం తలలు పట్టుకుని కూర్చుంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తం గా 4,08,913  కేసులు నమోదు అవగా, 18,260 మంది కరొనకు బలి  అయ్యారు. మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదు అవడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రం గా ఉందొ తెలుస్తుంది. మొత్తంగా 1,07,073 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.