మీడియా జోలికి రావద్దు..కెసిఆర్ 

post

కరోనా వైరస్ విస్తృతం గా విస్తరిస్తున్న నేపధ్యం లో లాక్ డౌన్ విధించిన అంశం పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, బయటకు రావద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, పోలీసులు, ఎక్కడికక్కడ ప్రజల మధ్యలో ఉంది కధానాయకుల లెక్క ప్రజలను కాపాడుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే, ఈ సమావేశం లో మీడియా వ్యక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారన్న ప్రస్తావన వచ్చింది. అయితే. ప్రజలు ఇష్టం వచ్చినట్లు బయటకు రావడం తో పోలీసులు లాఠీ ఛార్జ్ ప్రారంభించారు. మీడియా వ్యక్తులను కూడా అడ్డుకున్నారన్న విషయం తన దృష్టికి వచ్చింది కెసిఆర్ చెప్పుకొచ్చారు.
     ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ, మీడియా ప్రజలకోసమే పని చేస్తోందని, మీడియా వారికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా వారిని అనుమతించాలసిందిగా ఆయన పోలీసులకు సూచించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, వారెక్కడికి గుంపులు గుంపులు గా వెళ్లరని, మనం ప్రెస్ మీట్ లు పెడితేనే గుంపులుగా వస్తారని, వారి న్యూస్ కోసం వారు తిరుగుతారు..వారిని అడ్డుకోవద్దు అని సూచించారు. ఈ నేపధ్యం లో ఏవైనా పొరపాట్లు జరిగిన మీడియా వారు సహకరించాలని ప్రస్తుతం ఉన్న టెన్షన్లలో వీటి పైన అధికం గా ఫోకస్ చేయద్దని ఆయన అన్నారు.