ఉప్పల్ లో ఐసోలేషన్ వార్డులు..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో పలువురు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే, ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు  చేసుకోవచ్చని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ ముఖ్యమంత్రి ని కోరారు. ఆయన ఇంకా చెప్తూ, స్టేడియం లో నలభై వరకు పెద్ద పెద్ద గదులు ఉన్నాయని, పార్కింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయని  చెప్పుకొచ్చారు. ఇది ఐసోలేషన్ కేంద్రం గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాలు చెప్తూ హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్‌ విజయానంద్‌ బుధవారం సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాసారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందిస్తున్నామని తెలిపారు.  ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పోరాటం చేయడానికి తమ వంతు సాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా  ఉంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.