జనతా కర్ఫ్యూ పై అమెరికా పొగడ్తలు..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో, మార్చి 22 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తం గా జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు అందిస్తున్న వారందరికీ సంఘీభావం ప్రకటించే స్ఫూర్తి తో మొదలుపెట్టిన  ఈ జనతా కర్ఫ్యూ కు  దేశవ్యాప్తం గా విశేష స్పందన లభించింది. ప్రపంచమంతా మనవైపే చూసింది. ప్రధాని ఇచ్చిన పిలుపుకు ప్రజలు ఆచరణ ద్వారా విశేషమైన సమాధానాన్నిచ్చారు. ఒక మాటకు కట్టుబడి ఇన్ని కోట్ల మంది ప్రజలు స్వచ్చందంగా కర్ఫ్యూను పాటించడం నిజం గా గొప్ప విషయమే. ‘కరోనా వైరస్​కు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ, మెడికల్​ సర్వీసులు అందిస్తున్న వారికి సంఘీభావంగా ఇండియా జనమంతా కలసికట్టుగా ముందుకురావడం స్ఫూర్తిదాయకమైన విషయం' అంటూ సౌత్, సెంట్రల్​ ఆసియా తాత్కాలిక అసిస్టెంట్​ సెక్రెటరీ ఆఫ్​ స్టేట్​అలీస్ జి వెల్స్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఎమర్జెన్సీ సేవలు చేస్తున్న వైద్యులకు ఇతర ఉద్యోగులకు సంఘీభావం గా డ్రమ్స్ వాయిస్తూ, చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ జనమంతా ఒక మాటపై నిలబడి ఉన్నారన్నట్లు చాటి చెప్పే వీడియో ను ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో షేర్​ చేస్తే, ఆమె దానిని తిరిగి తన అకౌంట్ తో రీట్వీట్ చేసారు. 
   మరోవైపు, అమెరికా లో ఇండియా కంపెనీల ప్రతినిధులతో ఓ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా నేపధ్యం లో ఇండియా కంపెనీలు చేస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. స్థానికులకు సాయాన్ని అందించడానికి ఇండియా కంపెనీ లు కృషి చేస్తున్నాయని పొగిడారు. ఈ సమయం లో కరోనా పై కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నాం అని అధికారులు చెప్పుకొచ్చారు.