వారణాసివాసులతో భేటీ కానున్న ప్రధాని మోడీ..!

post

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత నియోజక వర్గమైన వారణాసి ప్రజలతో భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. దేశం పై ఒక్కసారి గా ఇరవై ఒక్క రోజులు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో ఆయన వారి అభిప్రాయలు తెలుసుకోనున్నారని ఆయన సన్నిహితులు తెలియచెప్పారు. వీడియో కాన్ఫెరెన్స్ తరువాత కూడా సామాన్యులకు ఆయన అందుబాటులో ఉండనున్నారు.  ప్రజల్లో ఎవరికైనా ఈ లాక్ డౌన్ పై సందేహాలు ఉన్నా.. వాటిని నమో యాప్ లోని ప్రజల సంబంధిత సెక్షన్ వద్ద నివేదించవచ్చని, ఏ సందేహం ఉన్న అక్కడ సంప్రదించమని ఆయన ఈ సందర్భం గా కోరారు. ఈ విపత్కారాన్ని ఎదుర్కోవాలంటే ప్రజలు కఠిన పరిస్థితులపై అవగాహనా కలిగిఉండాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కొత్త కేసులు రావడం లేదని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.