రాహుల్ పై దాడి..!

post

బిగ్‌బాస్‌-3 విజేత, రాహుల్‌ సిప్లిగంజ్‌పై కొందరు యువకులు దాడి చేసి గాయపరిచారు. బుధవారం రాత్రి  హైదరాబాద్ లోని   ఒక పబ్బులో ఈ దాడి జరిగింది. జరిగింది. తలపై బీరుసీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు రాగా . కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో పరస్పరం దాడులకు దిగారు. ఈ సందర్బంగా  యువకులు రాహుల్‌ను బీరు సీసాలతో కొట్టగా.  ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది..