కరోనా వల్ల ఉపాధి లేనివారికి రిలయన్స్ సాయం..!

post

కరోనా వైరస్ లక్షలమంది ప్రజలకు ఉపాధి లేకుండా చేసింది. ఉద్యోగస్తులు సరే, రోజుకూలీలు, కార్మికులకు నోటి వద్ద కూడు లేకుండా చేసింది. ఇప్పటికే, బాధితుల కోసం పలువురు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యం లో, రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోషల్ సర్వీస్ విభాగానికి చెందిన ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేసి కరోనా రోగులకు చికిత్స అందిస్తామని తెలిపింది. అంతేకాకుండా, రోగులను తరలించే వాహనాలకు ఉచిత ఇంధనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పలు నగరాల్లో ఉచిత ఆహార పంపిణి చేస్తామని తెలిపింది. ఇంకా, రోజుకు కనీసం ఓ లక్ష మాస్కులను అందిస్తామని చెప్పుకొచ్చింది. తమ సంస్థ కు చెందిన, శాశ్వత మరియు తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని ప్రకటించింది.