రోడ్డు పైకి వస్తే అరెస్ట్..!

post

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణం గా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు పట్టించుకోవటడు. చాలామంది రోడ్లపైకి వస్తున్నారు. దీనితో, ఆటో వాలాలు, క్యాబ్ డ్రైవర్లు కూడా రోడ్లమీదకి వస్తున్నారు. ఆర్టీసీ బంద్ కావడం తో వీరు అమాంతం ధరలు పెంచేశారు. ప్రభుత్వం చేస్తోన్న హెచ్చరికలను కూడా చాలామంది వాహనదారులు పట్టించుకోవట్లేదు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడం గమనించాల్సిన విషయం. దీనితో, అక్కడి టోల్ గేట్ ను మూసేసారు. కొన్ని చోట్ల, బయటకు వచ్చిన వారికీ కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు పంపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో వాహనాలపై యథేచ్ఛగా తిరుగుతోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలు కు మాత్రమే ప్రజలు బయటకు రావాలని పోలీసులు హితవు చెప్తున్నారు.