స్పెయిన్ పరిస్థితి దయనీయం..!

post

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కుప్పలు తెప్పలు గా నమోదు అవుతున్న కేసులు, ఊహించని మరణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొన్నిచోట్ల హాస్పిటల్ బెడ్ లు సరిపోకపోవడం తో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి నెలకొంటోంది. దీనితో, రోగులను  కటికనేలపైనే పడుకోబెట్టి చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి స్పెయిన్ లో చోటు చేసుకుంది. చైనా, ఇటలీ తరువాత అత్యధిక మరణాలు స్పెయిన్ లో కూడా చోటు చేసుకుంటున్నాయి. 
   తాజాగా, అక్కడ 425 మరణాలు చోటు చేసుకున్నాయి. మొత్తం మరణాలు రెండువేలకు పై చిలుకే ఉంటాయని అంచనా. మొత్తం ముప్పైమూడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. రాజధాని మాడ్రిడ్ లో పరిస్థితి మరీ దారుణం గా ఉంది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతోనే కిక్కిరిసిపోయాయి. దీనితో, రోగులని నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. అక్కడ ఈ ఆసుపత్రి చుసిన పరిస్థితి ఇలానే దయనీయం గా ఉంది.