కరోనా దెబ్బ శ్రీహరి కోటపైనా..!

post

కరోనా మహమ్మారి ప్రభావం శ్రీహరి కోట పై కూడా పడింది. అన్ని రంగాలు దాదాపు మూతపడ్డాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ సైతం అతలాకుతలం అయిపోతోంది. దీని ప్రభావం రాకెట్ ప్రయోగ కేంద్రాలపై కూడా పడింది. ఈ నెల 31 వ తేదీ వరకు శ్రీహరికోటలో జరుగవలసిన ప్రయోగాలు తాత్కాలికం గా నిలిపివేయబడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షార్ ను అధికారులు షట్ డౌన్ చేశారు. తాజాగా, సిబ్బంది కోసం వాడే జనరల్ షిఫ్ట్ బస్సులను రద్దు చేసారు. అత్యవసర విధులు నిర్వర్తించవలసిన వారు మాత్రమే రావాలని, తక్కిన వారు ఇళ్లకే పరిమితం అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసారు. కాగా, షార్ కేంద్రం లో జరుగుతున్నా నిర్మాణ పనులకు సైతం బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.