తొమ్మిది కి చేరిన కరోనా మృతులు..!

post

భారత్ లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశం లో పందొమ్మిది రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. తాజాగా, కోల్ కతాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మరణించినట్టు సమాచారం. అతనికి 55 సంవత్సరాలు ఉంటాయి. కరోనా లక్షణాలతో ఇటీవలే ఆసుపత్రి లో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అటు యూరప్ దేశాల కన్నా, భారత్ లో మరణాల రేటు తక్కువగానే ఉన్నా, త్వరితంగా వ్యాప్తిస్తూన్న వైరస్ తీరు ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం విధించిన లాక్ డౌన్, ఓ వారం రోజుల తర్వాత గాని ఫలితాలు ఇవ్వదని భావిస్తున్నారు. కొత్తగా ఎవరికీ వైరస్ సోకపోతే, ప్రభుత్వ చర్యలు ఫలించినట్లే.