తెలంగాణ లో ముప్పై కు చేరుకున్న కరోనా కేసులు..!

post

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లో ఉంటున్న తన ప్రతాపాన్ని చూపించడం మానడం లేదు. తాజాగా, తెలంగాణ లో మరో మూడు కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం, తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య ముప్పై కు చేరుకుంది. ఇండోనేషియా బృందంతో తిరిగిన కరీంనగర్ వ్యక్తికి, ఫ్రాన్స్ నుంచి వచ్చిన హైదరాబాద్ వాసికి మరియు లండన్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే, తెలంగాణ ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంది. పరిస్థితి చేయి దాటక మునుపే లాక్ డౌన్ ను ప్రకటించింది. తాజాగా,  సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మార్చి 31  వ తేదీ వరకు ప్రజలెవరూ రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.దేశం మొత్తం మీద ఇప్పటికి 424 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణం తో ఏడుగురు మృతి  చెందారు.