కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ..!

post

కరోనా వైరస్ అన్ని దేశాల్లోను విస్తరిస్తోంది. ఇప్పటికీ మందు కనిపెట్టకపోవడం తో, అన్ని దిశలు చికిత్స  కన్నా నివారణ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందుకే అన్ని దేశాలు షట్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. ఇళ్లనుంచి బయటకు రావద్దని తమ ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. దీనితో, పలు కంపెనీ ఇప్పటికే తమ ఆఫీసులను బంద్ చేసి, ఉద్యోగులకు వర్క్ ప్రం హోమ్ వెసులుబాటుని కల్పించాయి. ఉత్పత్తి సామర్ధ్యం తగ్గుతూ వస్తోంది. దీనివల్ల స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. గత వారం లో ఓసారి, తిరిగి ఈరోజు ఉదయం సెన్సెక్స్ పాతాళానికి చేరుకోవడం తో సెబీ కల్పించుకుని ట్రేండింగ్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 
   ఈ మార్పుల ప్రభావం మన రూపాయి పై కూడా పడింది. ఇప్పటికే రూపాయి విలువ అంతంత మాత్రం గా ఉంది. అది ఇంకా దిగజారిపోయింది. ఫారెక్స్ సెషన్ లో చారిత్రక కనిష్ఠాన్ని నమోదు చేస్తూ, క్రితం ముగింపుతో పోలిస్తే 95 పాయింట్లు పడిపోయి రూ. 76.15కు చేరుకుంది. కరోనా భయాలు స్టాక్ మార్కెట్ ను చుట్టుముట్టాయి. స్టాక్ మార్కెట్ తో పాటు, బులియన్ మార్కెట్ కూడా ఈ మహమ్మారికి బలి ఐంది.  నేటి సెషన్ ప్రారంభంలోనే డాలర్ విలువతో పోలిస్తే 75 పైసలు నష్టపోయిన రూపాయి, ఆపై ఇంకా పతనానికి చేరుకుంది. క్రూడాయిల్ విషయానికి వస్తే, బ్యారెల్ ధర 26.24 డాలర్లకు పడిపోయింది. ఇది శుక్రవారం తో పోలిస్తే, 2.74 శాతం తక్కువ గా ఉంది.