బ్యాంకు ఖాతాదారులూ...ఇవి పాటించి సాయం చేయండి..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో ఇప్పటికే పలు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లు ప్రకటించి సరిహద్దు లు కూడా మూసివేశాయి. దేశ వ్యాప్తం గా కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణం లో అత్యవసర సేవలు మినహా మిగిలినవి బంద్ చేయాలనీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, బ్యాంకులు కూడా కొన్ని షరతులు పెట్టాయి. అయితే, కొన్ని సేవలను మాత్రం అందిస్తున్నట్లు తెలిపాయి.
   కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో ఇతర ప్రజలు ఎదుర్కొంటున్నట్లే, బ్యాంకు అధికారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నేపధ్యం లో పలువురు ప్రైవేట్, గవర్నమెంట్ బ్యాంకుల అధికారులు వర్క్ ప్రం హోమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. మరీ అత్యవసరం ఐతే తప్ప బ్యాంకులకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాల వరకు ఎస్సేన్షియల్ సేవలు బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లభ్యమవుతున్నాయని, వినియోగదారులు వాటి ద్వారా సాయం పొందాలని సూచించారు. అత్యవసరమైన పరిస్థితిల్లో బ్యాంకు బ్రాంచులు కాల్ చేయవచ్చని, లేదంటే ఐవీఆర్ ద్వారా సాయం పొందవచ్చని చెప్పుకొచ్చింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో  ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఖాతాదారులు కూడా ఈ సాయం తో సహకరించాలని కోరింది.అయితే, ఆన్ లైన్ సేవలు మాత్రం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలాగా సహకరిస్తామని చెప్పుకొచ్చింది. మార్చి 23 వ తేదీ నుంచి నాన్ ఎస్సేన్శిఅల్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ క్లియరింగ్, రెమిటెన్స్‌లు, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు వంటి సేవలు తప్పక అందుబాటులో ఉంటాయని పేర్కొంది.