నేను సైగ చేస్తేనా…!

post

హిందూపురం లో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కు నిన్న చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించినందుకు గాను, ప్రాంత అభివృద్ధి కి అడ్డం పడుతున్నారని, అక్కడి వారు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ నేతల తీరుపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘మౌనం చేతగాని తనం కాదని, నేను కనుసైగ చేస్తే నిన్నటి పరిస్థితి వేరేలా ఉండేదని, కక్ష సాధింపు చర్యల కన్నా రాష్ట్ర అభివృద్ధి గురించి, ఆదాయాలను సమకూర్చుకునే విధానాల గురించి ఆలోచించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోజు తండ్రి శాసనమండలి ని ఉద్ధరిస్తే, నేడు తనయుడు అదే మండలి ని రద్దు చేసి తండ్రి ఆశయాలను నీరుగారుస్తున్నాడని ఆగ్రహించారు. మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని, ‘ఒక రాష్ట్రము..ఒక రాజధాని..’తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.