పడిపోయిన స్టాక్ మార్కెట్లు..ట్రేడింగ్ నిలిపివేత..!

post

భారత స్టాక్ మార్కెట్ ఇంకా దిగిపోయి లోయర్ circuit ను తాకింది. దీనితో, సెబీ కల్పించుకుని ట్రేండింగ్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మార్కెట్ నష్టం శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 10 శాతానికి మించి పడిపోయి లోయర్ సర్క్యూట్ ను చేరడం తో, ట్రేండింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ట్రేండింగ్ ను నిలిపివేసిన సమయం లో బీఎస్ఈ సెన్సెక్స్ 2,991 పాయింట్ల నష్టంతో 26,924 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 842 పాయింట్ల నష్టంతో 7,903 పాయింట్ల వద్ద ఉన్నాయి.

 దీనితో, యాక్సిస్ బ్యాంకు అత్యధికంగా 19.98 శాతం నష్టపోతోంది. కాగా, ఐసీఐసీఐ బ్యాంకు పదిహేను శాతం, ఇండస్ ఇండ్ 14.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ 14.23 శాతం, హీరో మోటో 13.90 శాతం మేరకు నష్టాల్లో పడ్డాయి.గతవారం లో కూడా ఓసారి, లోయర్ సర్క్యూట్ ను తాకినా సమయం లో ట్రేండింగ్ ను నిలిపివేశారు.