ఆదివారం పడిపోయిన విద్యుత్ వినియోగం..!

post

ఆదివారం  'జనతా కర్ఫ్యూ' విధించిన నేపధ్యం లో హైదరాబాదు లో విద్యుత్ వినియోగం పూర్తిగా పడిపోయింది. ఇది దాదాపు అరవై శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. సాధారణం గా, పనిదినాల్లో కంటే, శని ఆదివారాల్లో ఇరవై శాతం వరకు తక్కువ వినియోగం అవుతుంది. జనతా కర్ఫ్యూ నేపధ్యం అది మరో ఇరవైశాతానికి పడిపోయింది. ఆఫీసులు, షాపులు, వంటివి మూసివేయడం వల్ల విద్యుత్ డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. .హైదరాబాద్‌లో సాధారణ రోజుల్లో రోజుకి 2500 మెగావాట్ల వరకు డిమాండ్‌ ఉంటుంది. శని, ఆదివారాల్లో 2100 మెగావాట్లు డిమాండ్‌ ఉంటుంది. ఈ ఆదివారం, జనతా కర్ఫ్యూ కారణం తో మరో నాలుగువందల మెగావాట్ల తక్కువ వినియోగం జరిగింది. అంటే, 1700 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. జనం అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో, ఏసీలు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ వినియోగం పెరిగింది. అయినా, పరిశ్రమలు నడవకపోవడం, కార్యాలయాలు తెరవకపోవడం, మాల్స్ మూతబడటం వంటి కారణాల వల్ల విద్యుత్ వినియోగం తక్కువ గా ఉంది.అత్యవసర సేవలందించే ఆసుపత్రులు తప్ప హోటళ్లు, ప్రజారవాణా కూడా మూతబడింది. దీనితో, విద్యుత్ వినియోగం పూర్తి గా తగ్గుముఖం పట్టింది.