తెలుగు రాష్ట్రాల సరిహద్దు వద్ద పడిగాపులు.. నో ఎంట్రీ..!

post

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులను మూసివేశారు. ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో చాల మంది కరోనా భయం తో సొంత ఊరు వెళ్లిపోవడానికి ప్రయత్నించారు, పబ్లిక్ ట్రావెల్స్ ను బంద్ చేయడం తో, సొంత వాహనాలపైనే సొంత ఊళ్లకు పయనమయ్యారు.కాగా, వీరందరిని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. కోదాడ వద్ద సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. కోదాడ, పెబ్బేరు, భద్రాచాలం, నాగార్జున సాగర్, జహీరాబాద్ అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. సరిహద్దులు మూసివేయబడ్డాయని, ఎవరిని అనుమతించేది లేదని వారు చెప్పుకొస్తున్నారు. ఇటు నుంచి ఆంధ్ర వైపు వెళ్లే వాహనాల్ని అనుమతించడం లేదు. అలాగే, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే వాహనాలను కుడా అనుమతించడం లేదు.

              సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం తో, అక్కడి వాహనదారులు పోలీసులతో వాదులాట కు దిగారు. పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన అత్యవసర వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని, రాష్ట్రం నుంచి బయటకు వెళ్లనిస్తామని పోలీసులు తేల్చి చెప్తున్నారు. ఈ చెక్ పోస్టుల వద్ద, రవాణా, హెల్త్ , పొలిసు సిబ్బంది వరుసగా మూడు షిఫ్టులతో విధులు నిర్వర్తిస్తున్నట్లు  చెబుతున్నారు. లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.