తెలుగురాష్ట్రాల్లో కురవనున్న వర్షాలు..?

post

దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం కారణం గా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల శాఖ సూచించింది. దీనితో, నేడు, రేపు  కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు పడవచ్చు. రాయలసీమ నుంచి, కర్ణాటకకు, తెలంగాణ నుంచి ఉత్తర కేరళ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీనివల్ల, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వారు చెప్పుకొచ్చారు. దీని ప్రభావం వల్ల, ఈరోజు మరియు రేపు వర్షాలు పడవచ్చని వారు చెపుతున్నారు. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడచ్చని అంచనా వేశారు.