బయటకి వచ్చారుగా.. గుంజిళ్ళు తీయండి..!

post

ప్రధాని దేశవ్యాప్తం గా 'జనతా కర్ఫ్యూ' ని పాటించమని కోరిన సంగతి తెలిసిందే. ఆయన కోరికను ప్రజలంతా తూ.చ తప్పకుండ పాటించారు. కరోనా వైరస్ పైన అవగాహనా పెంచుకుని జాగ్రత్తగా మసలుకున్నారు. కానీ, కొంతమంది ఆకతాయిలు జాలిగా రోడ్లమీద తిరగడానికి ప్రయత్నించారు.ఈ ఘటన పూణే లో చోటు చేసుకుంది. దీనితో, పూణే పోలీసులు వీరిని పట్టుకుని గుంజిళ్ళు తీయించారు. జనతా కర్ఫ్యూ పాటించకుండా, రోడ్లమీద తిరిగినందుకు గాను గుంజిళ్ళు తీయించారు. మరోసారి బయటకి వస్తే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. యువకులతో గుంజీలు తీయిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు, హైదరాబాద్ లో ఇలా వచ్చిన వారికి గులాబీలు ఇచ్చి తిరిగి పంపారు.