కరోనా కు క్లోరోక్విన్ ..!

post

కొవిడ్‌-19 చికిత్సలో మలేరియా నిరోధక డ్రగ్‌ ‘క్లోరోక్విన్‌’ సమర్థవంతంగా పనిచేస్తోందని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.  క్లోరోక్విన్  ఉపయోగించేందుకు ఆమోదం కూడా తెలిపారు. ‘ క్లోరోక్విన్‌ను కొవిడ్‌ టీకా తయారీ ట్రయల్స్‌లో పాల్గొంటున్న ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చి.. .. వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తుందా? లేదా? అని పరీక్షించనున్నారు.  తాము కూడా కరోనా చికిత్సలో క్లోరోక్విన్‌ వాడామని, ప్రభావవంతంగా పని చేసిందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఫిబ్రవరిలోనే తెలిపింది. దక్షిణ కొరియా, బెల్జియం కూడా ఇదే మందువాడుతున్నట్లు పేర్కొన్నాయి.యాంటీబయాటిక్‌ అజిత్రొమైసిన్‌తో కలిపి క్లోరోక్విన్‌ను తీసుకుంటే.. రోగి శరీరంలో వైరస్‌ స్థాయిలు తగ్గినట్లు సమాచారం. వ్యాక్సిన్‌ తయారీలో అమెరికా ఇప్పటికే ఫేజ్‌-1 ట్రయల్స్‌ మొదలెట్టింది. చైనా అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఈలోగా కరోనా చికిత్సలో అనేక యాంటీ బయాటిక్స్‌ను పరీక్షించిన వైద్యులు.. క్లోరోక్విన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. మలేరియా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ మందును 1944లో ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో ఓ రకం కాలేయ ఇన్‌ఫెక్షన్లకు కూడా వాడేవారు.