జనతా కర్ఫ్యూ...మెట్రో బంద్..!

post

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగం లో భాగం గా ఆయన మార్చి 22 వ తేదీన 'జనతా కర్ఫ్యూ' పాటించాలని కోరారు. ఉదయం ఏడు గంటలనుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రజలు స్వచ్చందం గా కర్ఫ్యూ పాటించాలని కోరారు. దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు ఉంటుంది. జనతా కర్ఫ్యూ లో భాగంగా పదునాలుగు గంటలు ప్రజలు రోడ్ల మీద సంచరించ కుండా ఉంటె, రోడ్ల మీద ఉన్న వైరస్ ఎవరికీ అంటుకోదు. సరికదా, అది నశించిపోతుంది. దీనితో, కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారిపోతాయి. మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును తెంచేయడం కోసం ఈ కర్ఫ్యూ ను విధించారు. దీనిలో ప్రజలు స్వచ్చందం గా పాల్గోవాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. 
     ఇందులో భాగం గా, ఢిల్లీ మెట్రో ఆదివారం రోజున తమ సేవలను నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. ప్రజలు కూడా ఇళ్లలోనే  ఉంటారని, ప్రధాని తీసుకున్న 'జనతా కర్ఫ్యూ' కు మద్దతు గా తాము సేవలను నిలిపివేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఢిల్లీ లో ఇప్పటివరకు పదిహేడు కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.