మీది 'ఏ' బ్లడ్ గ్రూప్ అయితే జాగ్రత్తగా వుండాలి..!

post

కరోనా వైరస్‌కు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి.  చైనాలో కరోనా సోకిన 2,000 మంది రక్త నమునాలను పరీక్షించగా.. బ్లడ్‌ గ్రూప్‌ ఏ ఉన్నవారికి ఈ వైరస్‌ వల్ల ఎక్కువ హాని కలిగే అవకాశం ఉన్నట్టుగా తేలింది. వుహాన్‌ యూనివర్సిటీ జోంగ్‌నాన్‌ హాస్పిటల్‌లోని సెంటర్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ విభాగంలో ఈ  పరిశోధనలు జరిగాయి.
బ్లడ్‌ గ్రూపు ఏ కలిగినవారికి కరోనా వైరస్‌ సంక్రమణ రేటు అధికంగా ఉంటుందని, తీవ్రమైన లక్షణాలు కనబడతాయని పరిశోధకులు తెలిపారు. మరోవైపు బ్లడ్‌ గ్రూపు ఓ కలిగిన వారికి తేలికపాటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. బ్లడ్‌ గ్రూపు ఏ కలిగిన వ్యక్తులు కరోనా సంక్రమించకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ వారికి వైరస్‌ సోకితే ఎక్కువ నిఘాతో పాటు ఇతరులతో పోల్చితే మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. వుహాన్‌లో కరోనా బారినపడి మరణించిన 206 మందిలో బ్లడ్‌ గ్రూప్‌ ఏ కలిగినవారు 85 మంది, బ్లడ్‌ గ్రూప్‌ ఓ కలిగినవారు 52 మంది ఉన్నారని ఆ స్టడీలో పేర్కొన్నారు. 

అయితే . బ్లడ్‌ గ్రూపు ఏ కలిగినవారికి 100 శాతం వైరస్‌ సంక్రమిస్తుందని దీని అర్థం కాదు. అలాగే బ్లడ్‌ గ్రూప్‌ ఓ కలిగినవారికి వైరస్‌ పూర్తిగా సురక్షితమని కూడా కాదు. ప్రతి ఒక్కరు అధికారులు చెప్పే జాగ్రత్తలు తీసుకుంటూ.. చేతులను ఎప్పటికీ శుభ్రపరుచుకుంటూ ఉండాలి’ అని  పరిశోధకులు తెలిపారు.