పదోతరగతి పరీక్షలు వాయిదా..!

post

తెలంగాణ లో నిన్నే పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పరీక్షలపై ఓ వ్యక్తి హైకోర్టు పై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. అయితే, దీనిని కోర్టు పరిశీలించి, పదవ తరగతి పరీక్షలను వాయిదా వెయ్యాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం, పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, రేపటి పరీక్షా మామూలుగానే జరుగుతుంది. సోమవారం నుంచి జరుగాల్సిన పరీక్షలు మాత్రం వాయిదా వేశారు. మార్చి 31 వ తేదీ నుంచి ఏప్రిల్ అరవతేది వరకు జరగాల్సిన పరీక్షలు మాత్రం అప్పుడు పరిస్థితి ని బట్టి నిర్ణయించుకుంటారు.