ఎయిర్ కెనడా నుంచి 5,000 మంది ఔట్..!

post

కరోనావైరస్‌ ప్రభావంతో ఎయిర్‌ కెనడా 5,000 మంది సిబ్బందిని తాత్కాలికంగా పనుల నుంచి తొలగించింది.  ఇంత పెద్దసంఖ్యలో ఎయిర్‌ కెనడా ఉద్యోగులను తొలగించడం విచారకరమని కెనడా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (సీయూపీఈ) ఆందోళన వ్యక్తం చేసింది. యూనియన్లతో చర్చించే ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఏప్రిల్‌ 30 వరకూ లేఆఫ్స్‌ అమల్లో ఉంటాయన్న ఎయిర్‌ కెనడా పరిస్థితులు మెరుగుపడిన తరువాతఉద్యోగులు తిరిగి  తమ విధుల్లో పాల్గొంటారని తెలిపింది.  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 31 వరకూ దశలవారీగా రద్దు చేస్తామని అంతకుముందు ఎయిర్‌ కెనడా వెల్లడించింది.