పిడుగు మిగిల్చిన శోకం..!

post

నాలుగేళ్ళ క్రితం తండ్రి మృతి చెందాడు. పెద్దయ్యాక తోడవుతాడని ఆ తల్లి కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. పిలవని అతిధి గా పడిన పిడుగు వారింట్లో శోకాన్ని మిగిల్చింది. మంచి చదువులు చదువుకుని ఉన్నత మైన స్థానానికి తన కొడుకు ఎదుగుతాడన్న ఆ తల్లి ఆశలకు వర్షం నీళ్లు చల్లింది. ఈ ఘటన భూమిరెడ్డి పాలెం లో జరిగింది. గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతం లో పిడుగు పడింది. 

  మరో పది రోజుల్లో ఆ బాలుడు పదవతరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యం లో పాఠశాలలకు సెలవలు ఇవ్వడం తో, ఆ విద్యార్థి ఇంటివద్దనే మంచం మీద కూచుని తన స్నేహితులతో కల్సి చదువుకుంటుంటున్నాడు. అకస్మాత్తు గా పిడుగు పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి చనిపోయినా, ఆ లోటు తెలియకుండా పెంచుకుంటున్న ఆ తల్లి శోకానికి అంతులేదు. నన్నెవరూ పెంచుతారు రా కన్నా..అని ఆమె రోదిస్తున్న రోదనలు స్థానికుల హృదయం ద్రవించింది.

గొర్రెల కాపరి కూడా..!

జామి మండలంలోని అలమండ పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కూడా పిడుగు కి బలి అయ్యాడు. గ్రామానికి చెందిన వియ్యపు రమణ (46) అనే వ్యక్తి, బోగ రాములమ్మ, తదితరులు పద్మనాభం మండలం గంధవరం కోమటి చెరువు వద్ద  గొర్రెలు కాపలా కాయడానికి వెళ్లారు. అకస్మాత్తు గా పిడుగు పడి రమణ మృతి చెందాడు. రాములమ్మ అస్వస్థత కు గురి అయింది. ఆమె ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది.