కరీంనగర్ లో ఇంటింటి సర్వే..!

post

ఇండినేషియా నుంచి వచ్చిన టీం కరీం నగర్ లో తిరగడం తో అక్కడ ఒకేరోజు ఏడూ పాజిటివ్ కేసులు నమోదు అయినా సంగతి తెలిసిందే. దీనితో అక్కడ 144 సెక్షన్ విధించారు. రోడ్ల పైకి ఎవరు రావడానికి వీలు లేదని చెప్పుకొచ్చారు. గురువారం రోజున, వంద మంది బృందం తో ఇంటింటా సర్వే ప్రారంభించారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ఈ టీం ను ఏర్పాటు చేసారు.మూడు టీమ్​లకు ఒక సూపర్​వైజర్​, 7 నుంచి 10 టీమ్​లకు ఒక మెడికల్​ ఆఫీసర్​ను ఏర్పాటు చేసారు. ఈ బృందం లోని సభ్యులు ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలు ఉన్నాయేమో అని ప్రతి కుటుంబం లోను పరిశీలిస్తారు.  దగ్గు, జలుబు, ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నారా, విదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఎవరినైనా కలిశారా' అనే విషయాలు సేకరిస్తారు. నగరం లోనే సుమారు 18 వేల ఇండ్లు ఉన్నాయి. కలెక్టరేట్ కు మూడు కిలోమీటర్ల పరిధి మేర మరో తొమ్మిది వేల ఇండ్లు ఉండొచ్చని అంచనా.

మొదటిరోజు సక్రమంగా..!

నిన్న ప్రారంభం అయిన ఈ సర్వే సక్రమం గా నడిచింది. మొదటి రోజు సుమారు ఆరువేల ఇండ్లలో సర్వే నిర్వహించడం జరిగింది. కాగా, వారిలో ఇరవై మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోవడం తో హోమ్ క్వారంటైన్ లో ఉండమని సూచించారు.  జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి ఉన్న వారికి జాగ్రత్తలు చెపుతున్నారు. మరి కొందరి నుంచి శాంపిళ్లను స్వీకరించారు.

      ఇంటింటి సర్వే కోసం ఏర్పాటు చేయబడిన టీం లు అన్ని ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరిస్తారు. అనారోగ్యం తో ఉన్నవారి జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటె, వారిని ఐసోలేషన్ కు తరలిస్తారు. అనారోగ్యం తో బాధపడుతున్నవారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా టచ్ లో ఉండి, వారి ఆరోగ్యం గురించిన సమాచారాన్ని సేకరిస్తారు.

ఇప్పటివరకు ఎవరు లేరు..!

ఈ సర్వే గురించి మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ప్రజలు భయపడవద్దని, అన్ని ఏర్పాట్లు చేశామని, వ్యాప్తి ని నిర్ములించ గలమని, ఇప్పటి వరకు ఎలాంటి కేసు లు నమోదు కాలేదని, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు సర్వేలకు ప్రజలు సహకరించాలని కోరారు.