కరోనా రిస్క్ ను తగ్గించడానికి రోబోట్ లు..!

post

థాయ్ ల్యాండ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ని నివారించేందుకు రోబోట్ లను ఏర్పాటు చేసారు. కరోనా వైరస్ సోకినా వ్యక్తులకు ట్రీట్మెంట్ ఇచ్చే నేపధ్యం లో డాక్టర్లు, మరియు నర్సులకి కూడా ఈ వైరస్ సోకుతోంది. ఈ రిస్క్ ను తగ్గించడానికి ప్రత్యామ్నాయం గా రోబోట్ లను తీసుకువచ్చారు. ఈ రోబోట్ లు పేషంట్ టెంపరేచర్ ను చెక్ చేస్తాయి. వైద్యులకు సాయం గా ఉండే ఈ రోబోట్ లకు 'నింజ' అని పేరు పెట్టారు. 4 రోబోలను బ్యాంకాక్‌లోని హాస్పిటల్స్‌ లో ఏర్పాటు చేసారు. మెడికల్ సిబ్బంది కి రిస్క్ ని తగ్గించడం కోసం ఈ నింజ లను ఉపయోగిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ రోబోస్ పేషంట్ దగ్గర టెంపరేచర్ ని పరీక్షిస్తున్న సమయం లో డాక్టర్లు వీడియో కాల్ లో మాట్లాడే విధం గా వీటిని ఏర్పాటు చేసారు.