అవయవదానం చేసిన ముకేష్ సింగ్..!

post

నిర్బయ దోషులను ఈ రోజు తెల్లవారు జామున 5.30 గంటలకు ఉరితీసారు. అయితే ఉరి తీయడానికి అరగంట ముందు మేజిస్ట్రేట్  నేహల్ బన్సాల్ వీరు ఉంటున్న జైలు గది వద్దకు వెళ్లినపుడు వారు తమ  కోరికలను రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో ముకేష్  సింగ్ మరణించిన తరువాత తన అవయవాలను  దానం చేయడానికి అంగీకరిస్తూ అంగీకార పత్రం ఇచ్చాడు. వినయ్ శర్మ తాను జైలులో వుండగా వేసిన పెయింటింగ్ లను జైలు సూపరిండెంట్ కు ఇచ్చాడు. తనతో పాటు వుంచుకునే  హనుమాన్ చాలీసాను, ఒక ఫోటోను తన కుటుంబానికి అందజేయవలసిందిగా కోరాడు. పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ ధాకూర్ లు  ఏమీ కోరడం గాని ఇవ్వడం గాని చేయలేదు.