కరోనా కు కేరళ కౌంటర్..!

post

కరోనా వైరస్ (కోవిడ్ -19 ) ను ఎదుర్కోవడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ దైన శైలిలో చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో ఎక్కువగా విద్యాసంస్దలు, ధియేటర్స్, మాల్స్, కార్యాలయాల బంద్ వుంటున్నాయి. ఇటువంటి విపత్తు సమయంలో ప్రజలకు కల్పించే సదుపాయాలు, సౌకర్యాల గురించి మాత్రం ఎటువంటి ప్రకటనలు లేవు. అయితే దేశంలోనే కేరళ ఈ విషయంలో రోల్ మోడల్ గా నిలిచింది. కరోనా వణుకుతున్న రాష్ట్ర్ర ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా  రూ.20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది.  కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిని అర్దిక వ్యవస్ద అతలా కుతలమయిందని కేరళ సీఎం పినరయ్ విజయన్   తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలయిన కుదుంబశ్రీ గ్రూపులకు రు.2,000 కోట్ల రుణాలను అందిస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని దీనికి రు.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద ఏప్రిల్ నెలలో రు.2,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు.  రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చే సామాజిక పెన్షన్లను  రెండు నెలలకు (మార్చి, ఏప్రిల్) సంబంధించి ఒకే సారి పంపిణీ చేస్తామన్న సీఎం  దీనికోసం రు.1,320 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏ విధమైన పెన్షన్ రానివారికి  నెలకు రు.1,000 ఇచ్చేందుకు 100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు  విద్యుత్, నీటి బిల్లులు ఆలస్యంగా చెల్లించినప్పటికీ ఏ విధమైన జరిమానాలు విధించరు.  రాష్ట్ర వ్యాప్తంగా రు.20 రూపాయలకే భోజనం పెట్టేలా 1000 పుడ్ స్టాల్ష్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర్ర ప్రభుత్వం వద్ద వివిధ శాఖలకు సంబందించి పెండింగ్ లో వున్న బిల్లులను క్లియర్ చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు ప్రత్యేకంగా రు.500 కోట్లతో పధకానికి రూపకల్పన జరుగుతోందని సీఎం తెలిపారు.
 కేరళ రాష్ట్ర్రంలో ఇప్పటివరకూ 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న 31,173 మంది  వ్యక్తులను అబ్జర్వేషన్ లో వుంచారు. వీరిలో 30,926 మంది హోమ్ క్వారంటైన్ లో వుండగా 237 మంది ఆసుపత్రుల్లో వున్నారు.