ఇటలీలో ఒక్కరోజే 475 కేసులు ..!

post

కరోనా వైరస్‌ ధాటికి ఇటలీ వణికిపోతోంది.. వైరస్‌ కారణంగా ఆ దేశంలో బుధవారం ఒక్కరోజే 475 మంది చనిపోయారు. కరోనా కారణంగా ఇంత భారీ సంఖ్యలో ఒక్కరోజే మరణాలు సంభవించడం ఇంతవరకు ఏ దేశంలోనూ జరగలేదు. , ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2,978కి, కేసుల సంఖ్య 35,713కి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. బుధవారం ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు.కోవిడ్‌తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్‌లో 3,422 మంది మరణించారు. అమెరికాలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య బుధవారానికి 105కి చేరింది. మొత్తం 50 రాష్ట్రాలు ఈ వైరస్‌ బారిన పడ్డాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 6500కి పెరిగింది. భారత్‌లో కోవిడ్‌ బాధితుల సంఖ్య 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు.