గరీబ్‌ రథ్‌ లో కరోనా అలజడి..!

post

విదేశాల నుంచి దేశంలోకి ప్రవేశించేవారిలో  కరోనా వైరస్ సోకినట్లు అనుమానం వుంటే వారికి క్వారంటైన్ చేస్తున్నారు. అంటే వారు ఎవరితోనూ కలవకుండా ఇంట్లోనే వుండాలి. అయితే కొంతమంది నిర్లక్ష్యంతో అందరూ కరోనా ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది.విదేశాల నుంచి వచ్చిన ఓ నలుగురు యువకులు ముంబై నుంచి ఢిల్లీకి గరీబ్‌ రథ్‌ రైల్వే ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరు అధికారుల సూచనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా రైల్లో ప్రయాణించారు. అదే రైల్లో విధులు నిర్వహిస్తున్న టీసీ  ఈ నలుగురి చేతిపై ఉన్న ముద్రను గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ రైలును పాల్ఘర్‌ స్టేషన్‌లో నిలిపివేశారు. రైల్లో ప్రయాణిస్తున్న నలుగురిని కిందికి దింపేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఈ నలుగురు పాల్ఘర్‌లో వైద్య పరీక్షల కోసం ఎదురు చూసేందుకు నిరాకరించారు. 

ఢిల్లీలోని తమ ఇంటికి వెళ్తామని పట్టుబట్టారు. చివరకు రాష్ట్ర కరోనా కంట్రోల్‌ రూమ్‌తో సంప్రదించిన అనంతరం వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఓ ప్రైవేటు వాహనంలో నలుగురిని సూరత్‌ పంపించారు.